VMRDAచైర్మన్ కు SCRWAఅభినందన..


Ens Balu
1
విశాఖ సిటీ
2021-07-21 09:00:59

విశాఖ మహానగరంలో ప్రజల సమస్యలు దగ్గరుండి పరిష్కరిండచంలో ఎల్లప్పుడూ ముందుండే వైఎస్సార్సీపీ తూర్పునియోజకవర్గ సమన్వయకర్త అక్కరామాని విజయనిర్మలకు వీఎంఆర్డీఏ చైర్మన్ పదవి రావడం అభినందనీయమని SCRWA అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం విశాఖలో అక్కరమాని కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులతో ఆమెకు అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రజలతోపాటు, నాయకులు, కార్యకర్తల సంక్షేమం చూడటంలో అక్కరామానికి ఎవరూ సాటిరారని కొనియాడారు. అలాంటి మంచి వ్యక్తి రాజున్న రోజుల్లో మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నక్కాని అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.