78 రోజుల్లో 23 వేల మందికి అన్నదానం..
Ens Balu
1
విశాఖ సిటీ
2021-07-21 09:33:24
విశాఖలోని పాత నగరంలో ఉన్న వివేకానంద అనాధ, వృద్ధుల ఆశ్రమం అన్నార్తులకు, వృద్దులకు బాసటగా నిలుస్తోంది. దాతలు సహాయ,సహాకారాలతో కేవలం 78 రోజుల్లో 23 వేల మందికి అన్న ప్రసాదం అంద చేయకలిగింది. ఈ సందర్భంగా విశాఖలో బుధవారం సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక సలహాదారు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, విశాఖ కేంద్రంగా వేల సంఖ్యలో నిరుపేదలకు అన్నదానం చేసిన ఘనత ఒక్క వివేకానంద సంస్థకే దక్కుతుందన్నారు. అనంతరం దివ్యాంగులకు, నిరుపేదలకు దుప్పట్ల పంపిణీశారు. తదుపరి పలువురికి అన్నదానం, రిక్షా కార్మికులకు వస్త్రధానం చేపట్టారు. పాడేరు ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే చిన్నారి గత కొద్ది రోజుల క్రితం నగరంలోని వివేకానంద ఆశ్రమానికి చేరుకుంది. ఆదరించే వారు లేకపోవడంతో లక్ష్మీ బాధ్యత ను సంస్థ సభ్యులు తీసుకున్నారు. ఇక్కడ ఆశ్రమంలో లక్ష్మీ కి ఆశ్రయం కల్పించారు. అంతే కాకుండా సంస్థ మహిళా సభ్యులు ఆధ్వర్యంలోనే రజస్వల శుభ కార్యక్రమాన్ని సైతం చేపట్టారు. తమ పిల్లలు తో సమానం గా ఈ శుభాకార్యం జరిపించి,పలువురు కి తాంబూ లాలు లక్ష్మీ ద్వారా అందించి ఆశీస్సులు అందించారు. సంస్థ సభ్యులు తో పాటు శ్రీనుబాబు ఆశీస్సులు అందచేసి లక్ష్మికి కొంత ఆర్దిక సహాయాన్ని అందచేశారు. సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు మాట్లాడుతూ, దాతలు అందరి సహకారం తో సేవా కార్యక్రమం లు కొన సాగిస్తున్నమన్నారు. సంస్థ సభ్యులు పోతు రాజు,ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.