సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహస్వామి( సింహాద్రిఅప్పన్న)వారికి విశాఖ శివాజీపాలెంకు చెందిన కండ్రప ఉష, కృష్ణమూర్తి దంపతులు లక్షా నూట పదహారు రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్లో నగదు చెల్లించి రసీదు పొందారు. శ్రీస్వామివారి నిత్య అన్నదాన పథకానికి ఈ విరాళమిస్తున్నట్లు దాతలు ప్రకటించారు. తమ పెళ్లిరోజైన జూన్ 21న భక్తులకు అన్నదానం చేయాలని దాతలు కోరారు. అనంతరం స్వామవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా దాతకు ఆలయ సిబ్బంది ప్రసాదాన్ని అందించగా, వేదపండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.