సీఎంను కలిసిన ఎస్పీ రవీంధ్రబాబు..
Ens Balu
1
Kakinada
2021-07-22 13:26:08
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈమేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంని కలిసిన విషయం జిల్లా కార్యాలయం ప్రకటనలో తెలియజేసింది. రవీంధ్రబాబు ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన దగ్గర నుంచి జిల్లాలో చేపట్టిన సంస్కరణలు పరిపాలనపై సీఎం ఎస్పీ రవీంధ్రబాబుని అభినందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహిళా పోలీస్ వ్యవస్థ, దిశ ను జిల్లాలో ప్రజలకు చేరువ చేయాలని ఈ సందర్భంగా సీఎం ఎస్పీకి సూచించినట్టు సమాచారం. చాలా కాలం తరువాత జిల్లాకి మంచి డేరింగ్ వున్న ఎస్పీ వచ్చి పోలీసుల వర్గాలే అదిరిపడేలా చేపడుతున్న కార్యకలాపాలు, పోలీస్ శాఖలో చర్చనీయాంశం అవుతున్నాయి.