గ్రామాభివ్రుద్ధిలో సర్పంచ్ లే కీలకం..


Ens Balu
2
Kakinada
2021-07-22 14:02:01

దేశం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పైనించాలంటే గ్రామాలు అభివృద్ధి సాధించాలని, అందుకు క్షేత్ర స్థాయి ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన  పంచాయతీ ఎన్నికలలో ఎన్నికైన సర్పంచ్ లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించి,ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు , కార్యక్రమాలు విజయవంతం కావాలంటే సర్పంచులు కీలక భాగస్వామ్యం వహించాలన్నారు. భారత రాజ్యాంగంలో పంచాయతీలకు, సర్పంచులకు ప్రత్యేక స్థానం ఉందని గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పిన మహాత్ముని మాటలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన సచివాలయ  వ్యవస్థ ద్వారా సుమారుగా 530 సేవలు అందించబడుతున్నాయన్నారు. తమ సొంత అనుభవాలను ఇతరులతో పంచుకొని తమ గ్రామంలో గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని సర్పంచులు అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. 

జిల్లాలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్ నెస్  సెంటర్లు,బల్క్ మిల్క్ సెంటర్ల కు సంబంధించి సుమారుగా 4,500 నూతన భవనాలు నిర్మాణం జరుగుతుందని, త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి అయ్యే విధంగా సర్పంచులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా బహిరంగ మలవిసర్జన, పారిశుద్ధ్యంలో ఉత్తమ పనితీరు కనబరిచిన సర్పంచులకు జాతీయ స్థాయిలో  ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందించ బడుతున్నాయన్నారు. గ్రామాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారిలో మార్పు తీసుకు రావాలన్నారు. ప్రధానంగా పచ్చదనం , తడి-పొడి చెత్త సేకరణ,  పారిశుద్ధ్యం,త్రాగు నీరు ఇతర అంశాలపై  ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా లేకపోతే అనేక రోగాలకు నిలయంగా ఉంటుందన్నారు. 

కోవిడ్ పాజిటివ్ రేటు అత్యధికంగా ఉన్న గ్రామాల్లో పూర్తిగా ఆంక్షలు విధించడం జరుగుతుందని,కరోనా నియంత్రణకు ఎటువంటి సందేహాలకు పోకుండా సర్పంచులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన సర్పంచులు తమకు  ఎదురయే  ప్రతి సవాళ్లను ఒక ఛాలెంజ్ గా తీసుకుని గ్రామాలను  అభివృద్ధి పథంలో నడిపించడం ద్వారా జిల్లాకు మంచిపేరు వస్తుందని కలెక్టర్ తెలిపారు.  జిల్లా పరిషత్ ప్రధాన కార్యదర్శి ఎన్ వివి.సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1103 గ్రామ పంచాయతీలకు గాను 1072 మంది ఈ శిక్షణా కార్యక్రమలలో పాల్గొంటున్నారు.5 వెలు జనాభా పైనున్న 218 గ్రామాల్లో సర్పంచ్ లకు సామర్లకోట ఈటీసీ కేంద్రంలోను ,854 మందికి ఐదు డివిజన్లలో శిక్షణాతరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొలిరోజు శిక్షణా కార్యక్రమానికి  సంబంధించి కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్న కాకినాడ, కరప,తాళ్ళరేవు మండలాల నుంచి సుమారుగా 49 మంది శిక్షణ తరగతులకు హాజరైనట్లుఆయన తెలిపారు.

  గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించడంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో నిర్మాణాత్మకమైన పాత్రను పోషించే విధంగా గ్రామ సర్పంచులు పరిపాలన విధానం పై అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ ఆర్టీవో ఏజీ.చిన్నికృష్ణ తెలిపారు. క్షేత్ర స్థాయిలో సర్పంచులు ఉత్సాహంగా ఉంటే లబ్ధిదారులకు మంచి జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి ఎస్ వి నాగేశ్వర నాయక్ తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి అంశం పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకొని, ఏ విధమైన సందేహం ఉన్న ఇక్కడే నివృత్తి చేసుకోవాలని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిఎల్ డీఓ. మధుసుధన్ రావు ,కో-ఆర్డినేటర్ కెఎస్ .ఆర్మ్ స్ట్రాంగ్ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.