అభివృద్ధికి సర్పంచ్ లకు శిక్షణ అవసరం..


Ens Balu
4
Kakinada
2021-07-22 15:26:23

గ్రామ సర్పంచులు తమ గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడతాయని ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు వెల్లడించారు. గురువారం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 22నుండి 31 తేదీ వరకు పెద్దాపురం డివిజన్ సంబంధించిన సర్పంచులకు ఇచ్చు శిక్షణ కార్యక్రమాన్ని చైర్మన్ దొరబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక మండల ఎంపీడీవో రమణారెడ్డి అధ్యక్షతన శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా తరగతిలో చైర్మన్ దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు సర్పంచులు ఈ శిక్షణా తరగతులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది  గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు గ్రామ సచివాలయం ద్వారా అందించి మంచి కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరారు . ప్రజల అభిమానంతో మరో సారి  మీరే సర్పంచ్ గా గెలవాలని ఆకాంక్షించారు .రాష్ట్రప్రభుత్వం కులమతాలకు అతీతంగా ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు ఇందులో భాగంగానే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లో రాష్ట్రంలో 117వేలు కాలనీలకు, 30 లక్షల పట్టాలు అందజేశారని తెలిపారు.  గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పోటీపడి గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ శిక్షణ లో పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ సర్పంచ్ యొక్క విధులు- బాధ్యతలు, వివిధ సంక్షేమ కార్యక్రమాల పై అవగాహన , త్రాగునీరు,గ్రామీణ రోడ్ల నిర్మాణం , తదితర అంశాలపై పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు,పెద్దాపురం డివిజనల్ అభివృద్ధి అధికారి ప్రసాదు, డివిజనల్ పంచాయతీ అధికారిణి అమ్మాజీ , తాసిల్దార్ బి. శ్రీదేవి  ఈ ఓ పి ఆర్ డి మహేశ్వరి. కోటనందూరు, పెద్దాపురం, తొండంగి మండలాలకు చెందిన 54 మంది గ్రామ  సర్పంచులు సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.