ప్రజలకు సకాలంలోనే సేవలందాలి..
Ens Balu
4
Vizianagaram
2021-07-22 15:37:48
ప్రజలకు సకాలంలో సచివాలయాల నుంచి సేవలు అందించేందుకు సిబ్బంది శ్రమించాలని జెసి జె.వెంకటరావు ఆదేశించారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని కొత్త అగ్రహారం రెండో వార్డు సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన ముందుగా హాజరు పట్టీని పరిశీలించి, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. అనంతరం సచివాలయ రికార్డులను పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీశారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ రిక్వెస్టుల పై సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వం సచివాలయాల ద్వారా అందించే 745 సేవలను ప్రజలకు అందించి తద్వారా వారి సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపించాలన్నారు. సిబ్బంది అంతా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమయ పాలన పాటించాలని, వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జెసి ఆదేశించారు.