వైఎస్సార్ చేయూత లేఖలు ఆవిష్కరణ..
Ens Balu
4
Vizianagaram
2021-07-22 15:42:03
వైఎస్ఆర్ చేయూత లబ్దిదారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి రాసిన లేఖలను, కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, పలువురు ప్రజాప్రతినిధులు గురువారం ఆవిష్కరించారు. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించిందీ, అర్హతలు, లక్ష్యాలను ఈ లేఖల్లో వివరించారు. వీటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న చేయూత లబ్దిదారులందరికీ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు, ఎంఎల్‌సి పెనుమత్స సురేష్ బాబు, ఎంఎల్ఏలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, కొప్పలవెలమ కార్పొరేషన్ ఛైర్మన్ నెక్కల నాయుడుబాబు, దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రంగుముద్రి రమాదేవి, కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి, డిఆర్‌డిఏ పిడి కె.సునీల్ రాజ్‌కుమార్, బిసి కార్పొరేషన్ ఇడి ఆర్‌వి నాగరాణి తదితరులు పాల్గొన్నారు.