థర్డ్ వేవ్ ఎదర్కోవడానికి పక్కాగా ఏర్పాట్లు..


Ens Balu
4
Kakinada
2021-07-23 14:11:19

కోవిడ్ పాజిటివ్  అధిక నమోదు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం  కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తో కలిసి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లోని పిల్లల ప్రసూతి కేంద్రం తో పాటు  నవజాత శిశు చికిత్సా కేంద్రాలను డాక్టర్ల్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ పాజిటివిటీ తగ్గుముఖం పట్టిందని , అలాగని  అజాగ్రత్తతో ఉండకూడదన్నారు. ముఖ్యమంత్రి వైయస్  జగన్మోహన్ రెడ్డి థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తం చేస్తున్న దృష్ట్యా  ప్రభుత్వ ఆసుపత్రిలో చేపడుతున్న పనులను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోడానికి అవసరమైన  అన్ని చర్యలు తీసుకుంటున్నామని  ఆగస్టు ఒకటో తేదీ నాటికి జిజిహెచ్ లో జరుగుతున్న పనులు   పూర్తి అవుతాయన్నారు.  థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకొని కాకినాడ  సామాన్య ఆసుపత్రిలో రెండు వందల పఅడకల ను సిద్ధం చేస్తున్నామన్నారు. కాకినాడ జిజిహెచ్ కు జిల్లా తో  పాటు ఇతర జిల్లాల నుండి రోగులు వస్తుంటారని  వాటికి తగిన విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.  మొదటి ,రెండోవ  దశల కోవేట్ ను  ఎదుర్కో గలిగామని థర్డ్ వేవ్ కావలసిన  అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.   

 వరదలు భారీ వర్షాలు తో పోలవరం వద్ద  గోదావరి నీటిమట్టం పెరుగుతున్న దృశ్య ధవళేశ్వరం వద్ద శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నాటికి నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.  వీటిని దృష్టిలో పెట్టుకుని  జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు రెవిన్యూ డివిజనల్ కేంద్రాలు, మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికీ అప్పుడు పరిస్థితులను గమనిస్తున్నామన్నారు. అవసరమైన సహాయక చర్యలు తగిన విధముగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ముఖ్యంగా ముంపుకు  గురవుతున్న ఏజెన్సీ ప్రాంతంలో బిసి సంక్షేమ శాఖ మాత్యులు  చెల్లి బోయిన వేణు గోపాల కృష్ణ వారితో శనివారం నాడు పర్యటించనున్నట్లు కలెక్టర్  వెల్లడించారు.  ప్రస్తుతం  జిల్లాలో ప్రాణ, ఆస్తి  నష్టము జరగ లేదని అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. తొలుతగా కలెక్టర్ జిజిహెచ్ లో హాస్పిటల్ సూపర్నెంట్ ఆర్ మహాలక్ష్మి,  డాక్టర్ల బృందాలతో కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ ,శిశుసంజీవని, నవజాత శిశువు చికిత్స కేంద్రం, నర్సింగ్ స్టేషన్,  ఐ సి యు ,స్పెషల్ కేర్ జోన్ , నియోనేటల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ల ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులను కలెక్టర్ బృందం పరిశీలించి పనులు త్వరితగతిన సంబంధిత కాంట్రాక్టర్లకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.