స్టాండింగ్ కమిటీ బరిలో 20 మంది..


Ens Balu
2
GVMC office
2021-07-23 15:18:08

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జూలై 27వ తేదీన జరుగుతున్నందున, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు పోటీలో 20 మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారని,  తేది.23.07.2021 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉన్నా, బరిలో ఉన్న సభ్యులు ఎవ్వరునూ నామినేషనలు ఉపసంహరణ చేసుకోనందున  పోటీలో 20 మంది సభ్యులూ ఉన్నారని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు.  జూలై 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల జరిగిన అనంతరం ఓట్ల లెక్కింపు జరిపించి గెలిచిన స్టాండింగ్ కమిటీ సభ్యుల ఫలితాలను ప్రకటిస్తామని కమీషనర్ తెలిపారు.