తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా చేవూరి హరికిరణ్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ జె.మురళీధరరెడ్డిని వైద్యశాఖ ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా బదిలీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 16 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వుల జారీచేసింది. అన్ని జిల్లాల్లో రెండేళ్లు పూర్తిచేసుకున్న కలెక్టర్లను ప్రభుత్వం బదిలీలు చేయడం విశేషం. మురళీధరరెడ్డి తూర్పుగోదావరి జిల్లా అభివ్రుద్ధిలోనూ, ప్రభుత్వ పథకాల అమలులోనూ చాలా కీలకంగా వ్యవహరించారు. స్పందన దరఖాస్తుల పరిష్కారంలో విశేషంగా క్రుషిచేసిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.