క‌లెక్ట‌ర్‌ను స‌న్మానించిన రిటైర్డ్ జెడి..


Ens Balu
3
Vizianagaram
2021-07-24 13:42:56

ఆర్అండ్ఆర్ క‌మిష‌న‌ర్ గా బ‌దిలీపై వెళ్తున్న జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ రిటైర్డ్ జెడి ఎంవిఏ న‌ర్సింహులు శ‌నివారం స‌న్మానించారు. క‌లెక్ట‌ర్‌గా హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్  జిల్లాకు చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న పేరు జిల్లా చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ డిడి మ‌నోజ్‌కుమార్, ఏడి తిమ్మారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.