ఫోర్టి బియ్యం పై అవగాహన కల్పించండి..
Ens Balu
2
Vizianagaram
2021-07-24 13:44:39
ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పోషక విలువలతో కూడిన బియ్యమని గ్రామాలలో ప్రజలకు సర్పంచులు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం సర్పంచులకు వీడియో ప్రదర్శన ద్వారా ఫోర్టి బియ్యం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి 100 కేజీల బియ్యంలో ఒక కేజి పోర్టిఫైడ్ బియ్యం కలిపి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసి పేద ప్రజలకు అందజేయడం జరుగుతుందని అన్నారు, ముందుగా ప్రతి ఒక్కరూ ఫోర్ట్ ఫేడ్ బియ్యం పై అవగహన కలిగి ఉండాలన్నారు. ఇందులో అధికంగా సూక్ష్మ పోషకాలు ఉన్నందున రక్త హీనత నివారణా, నాడీ వ్యవస్థ అభివృధి, గర్భస్థ శిశు వికాసం భావితరాల బంగారు భవిష్యత్తుకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారమన్నారు, చిన్నారులకు పరిపూర్ణ ఆరోగ్యం ఫోర్ట్ ఫేడ్ బియ్యంతోనే సాధ్యమన్నారు. ఈ సర్పంచుల శిక్షణ ముగింపు సమావేశానికి పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, డి.ఎల్.డి. ఓ రాజ్ కుమార్, పార్వతీపురం, సీతానగరం, కొమరాడ మండలాలకు సంబంధించి తహసీల్దార్లు, ఎంపి.డి.ఓలు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.