రేపు శ్రీకాకుళంలో ర‌క్త‌దాన శిబిరం..


Ens Balu
3
Srikakulam
2021-07-24 14:11:32

 శ్రీకాకుళం నగరంలోని డిసిసిబి కాలనీ చిల్డ్రన్ పార్క్ వద్ద ఆదివారం సుందర సత్సంగం బృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు  పెరంబుదూర్ సూరిబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు ఆయన  మీడియాకి లేఖ విడుదల చేశారు. తమ బృందం ద్వారా  గడిచిన పదేళ్లుగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుందన్నారు. గురుపౌర్ణిమ పురస్కరించుకొని 100 మంది సుందర సత్సంగానికి చెందిన మహిళలు రక్తదానం గురుదక్షిణగా  చేయనున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.  స్వచ్ఛంద రక్త దాతలు కూడా ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో రక్తం కొరత ఉన్నందున తమ బ్రుందం తరఫున ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నామన్నారు.