పచ్చతోరణంలో ప్రతీమొక్కా బతకాలి..


Ens Balu
1
Tirupati
2021-07-25 14:32:44

జగనన్న పచ్చతోరణంలో నాటే ప్రతి మొక్క బతకాలని, ఆవిధంగా కార్యాచరణ ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం స్ధానిక మంత్రి కాంపుకార్యలయ సమావేశం మందిరంలో నరేగా డైరెక్టర్ చినతాతయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాధ్ , పిడి ద్వామ చంద్రశేఖర్, నరేగా లైన్ డిపార్ట్మెంట్ లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రానున్న పదిరోజుల్లో మెగా ప్లాంటేషన్ జరగాలని, ప్రస్తుతం జిల్లాలో గుర్తించిన 1100 కిమీ జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట జరుగుతున్న మొక్కల నాటడానికి జరుగుతున్న గుంతల త్రవ్వకం వేగవంతం కావాలని సూచించారు. మొక్కల పెంపకంలో ఆవెన్యూ, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కు ప్రాధాన్యత ఉండాలని , నాటే ప్రతి మొక్క బతకాలనే లక్ష్యం తో అధికారులు పనిచేయాలని, స్థానికులు సహకారం తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నరేగా లో నిర్దేశించిన 26 కోట్ల పనిదినాలు పూర్తి చేసి వేతనరూపంలో 6 నుండి 7 వెలకోట్లు నరేగా వేతన జీవులకు అందాలని సూచించారు. చేరువుల్లో పూడిక తీతపనులు , సిల్ట్ అప్లికేషన్ వంటివి ప్రాధాన్యత గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. నిధుల కొరత లేదని అనుకున్న లక్ష్యాలను అధిగమించేలా చూడాలని అన్నారు. ఈ సమీక్షలో డ్వామా డిపార్ట్మెంట్ ఎపిడీలు , అధికారులు పాల్గొన్నారు.