నగర రోడ్లను తక్షణమే బాగుచేయండి..


Ens Balu
1
Akkayyapalem
2021-07-25 14:44:35

విశాఖ మహానగరంలో ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్న గోతుల రోడ్లను పక్కాగా వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అక్కయ్యపాలెం హైవే జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆటో అండ్ మోటర్ వర్కర్స్ యూనియన్, AITUCఅనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి మాట్లాడుతూ, విశాఖ మహా నగరం మాధవధార, మురళి నగర్, ఆర్అండ్ బి జంక్షన్ ,అక్కయ్యపాలెం మెయిన్ రోడ్ లను ప్రమాదకరంగా మారిపోయాయన్నారు. ఆ ప్రాంతంలో ప్రయాణాలు చేస్తున్న ఆటోలు, వ్యాన్లు తరచూ రిపేర్లకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన సర్వీసులన్నీ ఆటోల రిపేర్లకు వస్తున్నాయన్నారు. ఉన్న గోతులు పడిన రోడ్లను పక్కాగా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .గత మూడు సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, కేబుల్ లైన్లు వేసుటకు త్రవ్విన గోతులను కప్పలేదని ఆరోపించారు.  దీనివల్ల మోటార్ బైకులు, ఆటోలు నడపాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వం పక్కా రోడ్ల  నిర్మాణం పేరుతో లీటర్ డీజిల్ పై  రూపాయి.12పైసలు.చొప్పున పెంచి 1200కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానా నింపుకుంటున్నా.. రోడ్లు మాత్రం పక్కాగా నిర్మాణం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే గోతుల రోడ్లను పక్కాగా వేసి రోడ్డు ప్రమాదాలనివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ప్రజావ్యతిరేకతకు గురికావాల్సి వస్తుందన్నారు..
ఈ కార్యక్రమంలోప్రభాకర్, కేలం శివ,పి.బాలు, శ్రీనివాస్, సన్యాసిరావు, సత్తిబాబు, నందీశ్వర రావులు తదితరులు పాల్గొన్నారు .
సిఫార్సు