పోలీస్ శాఖ పరంగా వచ్చిన అర్జీల పరిష్కారంలో చొరవ చూపాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ స్సీ రవీంద్రనాథ్ బాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే సదుద్దేశంతో తలపెట్టిన స్పందన కార్యక్రమాన్ని తిరిగి సోమవారం ఎస్పీ లాంఛనంగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా కార్యాలయంతోపాటు, సబ్ డివిజన్ కార్యాలయంలో కూడా స్పందన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎవరూ వ్యయప్రయాశలకోర్చి జిల్లా కేంద్రానికే రావాలనే నిబంధన పెట్టుకోవద్దన్నారు. కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన ఫిర్యాదు దారుల నుంచిం అర్జీలను స్వీకరించి సంబంధిత పోలీస్ అధికారులను సత్వరంగా పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన స్పందన కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడంతో ప్రజలు తమ సమస్యల అర్జీలతో జిల్లాఎస్పీకార్యాలయానికి ఎక్కువ మొత్తంలో అర్జీలతో జనం వచ్చారు.