3ఏళ్లలో జనరంజక పాలన అందించారు..


Ens Balu
1
Vizianagaram
2021-07-26 15:27:14

విజయనగరం, జులై 26:: జిల్లా కలెక్టర్ గా మూడేళ్లు జిల్లాలో పని చేసిన డా.ఎం.హరి జవహర్ లాల్  జనరంజక పాలనను అందించారని వక్తలు కొనియాడారు.  సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా అధికారులు, రెవిన్యూ అసోసియేషన్ అద్వర్యం లో అభినందన  వీడ్కోలు సభ నిర్వహించారు. కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు.  
ఈ సందర్బంగా జిల్లా జడ్జి జి. గోపి మాట్లాడుతూ ప్రకృతిని ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తిగా హరి జవహర్ లాల్ నిలిచిపోతారని తెలిపారు. కలెక్టర్ గా  జిల్లాలో పని చేసిన కాలం లో ఎన్నో చక్కని పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. తన కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శించక  అందరితో ఫ్రెండ్లీ కలెక్టర్ గా ఉన్నారన్నారు. అహంకారం, అసూయ తెలియని వ్యక్తి అని జిల్లా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. 
జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ మాట్లాడుతూ ఆయన నిరడంబరత తో,  ప్రశాంత వదనం తో  ప్రజలకు తొందరగా దగ్గరై పోతారని  అన్నారు. సంయుక్త కలెక్టర్  ఆసరా జె. వెంకట రావు మాట్లాడుతూ  కోవిడ్ కాలం లో ఆయన సమర్థతను చూశామని అన్నారు. 5వ బెటాలియన్ కమాండెంట్ విక్రమ్ పాటిల్ మాట్లాడుతూ అతి తక్కువ పరిచయం లొనే తనను స్నేహితునిగా చూసారన్నారు.  
సంయుక్త్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ  ముందుండి నడిపించిన నాయకుడని కొనియాడారు. వినయం, సంస్కారం కలగలిపిన మానవతా వాది అన్నారు. ప్రతీ రోజు ఎదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే  ఉంటామన్నారు. ఏ పని ఎప్పుడు, ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి యని, అందుకే మూడేళ్ళలో జిల్లాను ఉన్నత స్థానం లో నిలిపారని పేర్కొన్నారు. తన పాలనతో ప్రజలకు, అధికారులకు ప్రీతి పాత్రులైనారని అన్నారు.  సంయుక్త కలెక్టర్లు డా.మహేష్,   మాట్లాడుతూ పరిపాలన అనేది ఒక కళ అని, ఆ కళను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారని పేర్కొన్నారు. మయూ ర్ అశోక్ మాట్లాడుతూ విజయనగరం వెళ్తున్నామంటే అక్కడ హరి జవహర్ లాల్ కలెక్టర్  ఉంటారు, మీకు అన్ని విధాలా ప్రోత్సహిస్తారని చెప్పారని , వచ్చిన తర్వాత  అనేక విషయాలను తెలుసుకున్నానని అన్నారు.  ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి  ఆర్.కుర్మానాధ్,  సబ్ కలెక్టర్  భావన, సి.పి.ఓ విజయ లక్ష్మి, డిడి సోషల్ వెల్ఫేర్ సునీల్ రాజ్ కుమార్ తదితరులు కలెక్టర్ సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా మూడేళ్ళ కలెక్టర్ పాలన పై జిల్లా అధికారులు చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు, ఆర్.డి.ఓ భవాని శంకర్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మలకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.