కోవిడ్ టీకా అర్హులందరికీ వేయాలి..


Ens Balu
3
ఫిరంగిపురం
2021-07-26 16:12:16

కోవిడ్ 19 వాక్సినేషన్ కు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాక్సిన్ చేయించేలా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. మోగా వాక్సినేషన్ కార్యక్రమంలో  భాగంగా సోమవారం సాయంత్రం ఫిరంగిపురం మండలం తక్కెళ్ళపాడు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ పరిశీలించారు. వాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించి, గ్రామంలో ఇప్పటి వరకు కేటగిరిలు వారీగా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్యను జిల్లా కలెక్టర్ వైధ్యాదికారులను అడిగి తెలుసుకున్నారు. 45 సంవత్సరాలు వయస్సు దాటిన వారితో పాటు, గర్బీణీలకు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న మహిళలకు, ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కోవిడ్ వ్యాక్సినేషన్ నూరు శాతం అందించాలన్నారు.  వైద్యారోగ్యశాఖ అధికారలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు  గ్రామంలో డోర్ టూ డోర్ వెళ్ళి ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారి వివరాలు సేకరించి వెంటనే వాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే  మొదటి డోసు తీసుకున్న వారికి నిర్దేశిత సమయంలో సెకండ్ డోసు వేయించాలన్నారు.  కోవిడ్–19 వాక్సినేషన్ పై ఉన్న అనవసర అపోహలు తొలగించి  ప్రభుత్వం వాక్సినేషన్కు  అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకునే స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రజలను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసరు డా. వై సుబ్రహ్మణ్యం, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, ఎంపీడీవో శివప్రసాదు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ఫరీన్, గ్రామ సర్పంచి ఎం విజయలక్ష్మీ, వైద్యారోగ్య, పంచాయితీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.