ఎంతో ఆనందంతో వెళుతున్నాను..
Ens Balu
3
Vizianagaram
2021-07-26 16:41:57
పేదల దీవెనలు ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుందని, పేదల కోసం పని చేసే అవకాశాన్ని అదృష్టం గా భావించాలని బదిలీ పై వెళ్తున్న జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. సివిల్ సర్వెంట్లు ప్రజలతో మమేకం అయితేనే విజయం సొంతం చేసుకుంటారన్నారు. అధికారులు వత్తిడిని అధిగమించడానికి కళలు, క్రీడలు ఉపయోగ పడతాయన్నారు. ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినందునే అంకిత భావం తో, ఉత్సాహంతో పని చేయగలిగానని ముఖ్య మంత్రి గారికి కృతజ్ఞతతో ఉంటానన్నారు. అవార్డుల కోసం పని చేయలేదని, చేసిన పనిని గుర్తిస్తూ అవార్డు లు వరించాయని అన్నారు. కొత్తగా వచ్చిన జె.సి లు చాలా ఉత్సాహంగా, వివేకంగా పని చేస్తున్నారని, అయితే దేనికి ఎంత ప్రాధాన్యత నివ్వాలో తెలుసుకొని ముందుకెళ్లాలని సలహా ఇచ్చా రు. జిల్లాతో ఎన్నో మధుర జ్ఞాపకాలతో వెళ్తున్నానని, సంతృప్తిగా, సంతోషంగా ఉందని అన్నారు.