మంచితో చెడును దూరం చెయ్యొచ్చు..


Ens Balu
2
Vizianagaram
2021-07-27 13:44:08

మంచితనంతో ఎంత పనినైనా చేయించగలమని,  అది అధికారుల మధ్య సఖ్యతను, ప్రేమను పెంచుతుందని పదోన్నతి  పొంది బదిలీ పై వెళ్తున్న కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.  స్థానిక కృషి భవన్ లో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల సంఘం కలెక్టర్ కు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  తనకు కలెక్టర్ కన్నా వ్యవసాయ శాఖ లో పని చేసినప్పుడే ఎక్కువ గుర్తింపు వచ్చిందన్నారు. వ్యవసాయం అంటే ఇష్టమని,  ఆ శాఖ లో పని చేసిన కాలం లో చేసిన  అనేక సంస్కరణలను  గుర్తు చేసుకున్నారు. మూడేళ్ళ పాటు జిల్లాలో పని చేసి అందరి అభిమానాన్ని మూట కట్టుకొని తీసుకు వెళ్తున్నానని అన్నారు. సంయుక్త సంచాలకులు ఆశ దేవి మాట్లాడుతూ జిల్లా చరిత్ర లో  పీపుల్ కలెక్టర్ గా హరి జవహర్ లాల్ నిలిచిపోతారని కొనియాడారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు ఉమ మహేశ్వర నాయుడు, హరి కృష్ణ, తిరుపతి రావు, ఆత్మా పి డి లక్మన రావు, మార్కుఫెడ్, ఏ.పి సీడ్స్, ఆగ్రోస్ సంస్థల ప్రతినిధులు కలెక్టర్ గా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆడిట్ అధికారి హిమ బిందు కలెక్టర్ ను సన్మానించారు. స్టాండింగ్  ఒవేషన్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.