విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ను జిల్లా ఉద్యోగులు ఎప్పటికీ మరిచిపోరని సీతమ్మధార తహశీల్దార్ జ్నానవేణి అన్నారు. పదోన్నతిపై వెళుతులుతున్న కలెక్టర్ ను మంగళవారం తహశీల్దార్, సూపరింటెండెంట్ లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాని అభివ్రుద్ధి పధంలో నడిపించడానికి తమకు మంచి అవకాశం కల్పించి, ఆయనతోపాటు పనిచేసే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా మంచి అధికారి ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నందుకు కాస్త బాధగా కూడా ఉందన్నారు. కాకపోతే బదిలీలు ఉన్నతాధికారులకు సహజమని.. కానీ రెండేళ్లపాటు మంచి అధికారితో పనిచే అవకాశం రావడం, మంచి కార్యక్రమాలు ఆయనతో కలిపి చేయడం ఉద్యోగులమంతా మరిచిపోలేని అంశమని అన్నారు.