రూర్బన్ పనులపై దృష్టి సారించాలి..


Ens Balu
2
Srikakulam
2021-07-27 16:48:02

సోంపేట క్లస్టర్ లో రూర్బన్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. రూర్బన్ కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మంగళ వారం సమీక్షించారు. తాగు నీటి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్ క్రింద పనులు బాగా జాప్యం జరుగుతోందని వాటిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. పి.ఎం.ఏ.జి.వై క్రింద లావేరు, వీరఘట్టం, రాజాం, రణస్థలం మండలాల్లో మంజూరైన పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక అధికారులు పనుల పై దృష్టి సారించి మంజూరు నుండి పూర్తి అయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి  మాట్లాడుతూ ఇంజినీరింగ్  పనుల్లో 107 పూర్తి అయ్యాయని, 43 పనులు ప్రగతిలో ఉన్నాయని, 14 ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. పి.ఎం.ఏ.జి.వై క్రింద చేపడుతున్న పనులకు ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల మేర నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, డిపిఓ వి.రవి కుమార్, డిఆర్డిఏ పిడి బి. శాంతి శ్రీ, పంచాయితీ రాజ్ ఎస్ఇ కే.బ్రహ్మయ్య, వ్యవసాయ శాఖ జేడి కే.శ్రీధర్, ఏపిఇడబ్లుఐసి ఇఇ కే. భాస్కర రావు తదతరులు పాల్గొన్నారు.