విశాఖజిల్లా కలెక్టర్ గా డా.ఎ.మల్లిఖార్జున..


Ens Balu
2
Visakhapatnam
2021-07-28 13:21:49

విశాఖ జిల్లా కలెక్టరుగా  డా. ఎ . మల్లిఖార్జున బుధవారం ఉదయం  బాధ్యతలు స్వీక రించారు. ఈ సందర్భముగా జిల్లా జాయింట్ కలెక్టర్ లు  ఎం.వేణు గోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి, ఆర్.గోవింద రావు, పలువురు జిల్లా అధికారులు కలెక్టరు ను  మర్వాద  పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  తదుపరి కలెక్టరు జాయింట్ కలెక్టర్ లతో సమావేశమైయి పలు అంశాలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టరు డా. ఎ. మల్లిఖార్జున   విలేఖరులతో మాట్లాడుతూ  జిల్లాలో    ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికి  అందేలా కృషి చేస్తానన్నారు. ఎల్ల వేళలా అందుబాటు లో ఉంటూ  అధికారులందరి సమన్వయంతో   పట్టణ,  గ్రామీణ, గిరిజన ప్రాంతాలన్నింటికి సమ ప్రాధాన్యత నిచ్చి ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకంతో జిల్లాని రాష్ట్రంలోనే అభివ్రుద్ధి పధంలో ముందువరుసలో నిలబెడతానని చెప్పారు.