విశాఖ మధురవాడకు చెందిన విశ్వనాధ శివ శంకర్ శ్రీనివాస్, సుబ్బలక్ష్మి దంపతులు శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి(అప్పన్న)వారి నిత్యాన్నదాన పథకానికి లక్షా నూట పదహారు రూపాయలు (1,00,116) విరాళం అందించారు. ఫిబ్రవరి 22న తమపెళ్లి రోజు సందర్భంగా స్వామివారి సన్నిధిలో అన్నదానం చెయ్యాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆలయ పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల చెక్కును అందించారు. అనంతరం దాతలు స్వామివారి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు దాతలకు తీర్ధ ప్రసాదాలు అందించగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు.