సింహాద్రి అప్పన్నకు జిల్లా కలెక్టర్ పూజలు..
Ens Balu
1
Simhachalam
2021-07-28 13:50:02
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా వచ్చిన ఏ.మల్లికార్జున బాధ్యతలు చేపట్టేముందు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి(అప్పన్న)వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ సూర్యకళ, ఏఈఓ రాఘవ కుమార్, అధికారులు కలెక్టర్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. జిల్లా కలెక్టర్ గా విజయవంతంగా పనిచేయాలని, ఎన్నో మంచి పనులు చేయాలని అర్చకులు దీవించారు. కలెక్టర్ మల్లికార్జునకు కళ్యాణ మండపాన్ని కూడా చూపించి..ఆర్జిత సేవల గురించి ఈఓ సూర్యకళ వివరించారు.