బలవర్ధక బియ్యంపై అవగాహన పెంచండి..
Ens Balu
1
Vizianagaram
2021-07-28 13:55:27
బలవర్ధక బియ్యం(పోర్టిఫైడ్ రైస్) పై గ్రామాల్లో అపోహలున్నాయని, వాటిని పోగొట్టి ప్రజలు వినియోగించేలా చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. జె.ఎన్. టీ. యు లో జరుగుతున్న సర్పంచ్ ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి బుధవారం ఇన్ఛార్జ్ కలెక్టర్ హాజరైనారు. ఈ సందర్బంగా సర్పంచ్ లతో మాట్లాడుతూ ఫోర్టిఫైర్డ్ బియ్యం పై అవగాహన లేకనే ప్లాస్టిక్ బియ్యమని గ్రామాల్లో అపోహ పడుతున్నారాని, సాధారణ ధాన్యానికి పోషకాలను కలపడం ద్వారా బలవర్ధకంగా తయారు అవుతాయని అన్నారు. ప్రభుత్వ పథకాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించడం, వాటిని లబ్ది దారులకు పారదర్శకంగా అందించడం లో కూడా దృష్టి పెట్టాలన్నారు. గ్రామాభివృద్ధి లో సర్పంచ్ ల దే కీలక పాత్ర యని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుభాషిణి, డి.ఎల్.డి.ఓ రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.