సచివాలయాలు తనికీచేసిన ఎ.డి.హెచ్..
Ens Balu
3
విశాఖ సిటీ
2021-07-28 15:10:31
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ హార్టికల్చర్ విభాగపు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. దామోదర రావు 5వ జోన్ పరిధిలో మాధవధారలొని నాలుగు సచివాలయాలను బుధవారం సందర్శించి సచివాలయ కార్యదర్శుల బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టరు, డైరీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలని, ఎటువంటి అలసత్వం వహించరాదని కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయాలలో ప్రజలకు అర్ధమయ్యే విధంగా సూచిక బోర్డులు, అత్యవసర్ ఫోన్ నెంబర్లు, వివిధ పధకాలు తెలిపే నోటీసు బోర్డులు ఉండాలని ఆదేశించారు. కార్యదర్శుల విధులపై బయటకు వెళ్ళినప్పుడు తప్పని సరిగా మూమెంట్ రిజిష్టర్ లో పని పూర్తి వివరాలు వ్రాయాలని, సెలవు పెట్టవలసి వచ్చినప్పుడు జోనల్ కమిషనర్ కు తెలియపరచాలని ఆదేశించారు.