యాంత్రీకరణ పద్ధతులు అవలంబించాలి..


Ens Balu
2
Srikakulam
2021-07-28 15:28:15

రైతులు యాంత్రీకరణ పద్దతులు అవలంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.   బుధవారం మబగాంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యాంత్రీకరణ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక పద్ధతులు మన ముందుకు వచ్చాయని, వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  గతంలో పశువులుతో పని చేసేవారమని, ప్రస్తుతం యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.  యాంత్రీకరణ పై రైతులు అవగాహన పెంచుకొని పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడులు పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు సంబంధించి ప్రతీ విషయంపై చర్చిస్తున్నట్లు చెప్పారు.  మెరుగైన వ్యవసాయ విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంభించుకొని రాబడులు పెంచుకోవాలని పేర్కొన్నారు. మన ప్రాంతాలకు వ్యవసాయం చేయడానికి ఇతర ప్రాంతాలు నుండి వస్తారని చెప్పారు. కౌలు రైతుల్లో మనోధైర్యం నింపినట్లు చెప్పారు. రైతులు యాంత్రీకరణ పద్ధతులు ఆచరణలో పెట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని అందుకొని యాంత్రీకరణ పద్దతులు అవలంభించాలని రైతులకు పిలుపునిచ్చారు.  పరిశోధనా ఫలితాలు రైతులకు చేరాలని, రైతులు కూడా నూతన పద్ధతులు, నూతన వంగడాలను అవలంభించాలని వివరించారు.  శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయం యాంత్రీకరణ పద్ధతుల్లో చేయడానికి మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కూలీలు దొరకని సమయంలో యాంత్రీకరణ పద్దతులు అవలంబించి మంచి దిగుబడులు పొందవచ్చని చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల్లో యాంత్రీకరణ పై అవగాహన పెంచాలని కోరారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఖర్చు తక్కువగా ఉండి దిగుబడులు ఎక్కువగా ఉండాలన్నారు. రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలని చెప్పారు. రైతులు యాంత్రీకరణ పద్ధతులను అవలంభిస్తే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు. ఇలాంటి సమాశాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.  సుగర్స్ ఎజిఎం మాట్లాడుతూ కూలీలు సమస్య వలన యాంత్రీకరణ పై దృష్టి సారించాలని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్త పాలడుగు సత్యనారాయణ మాట్లాడుతూ యాంత్రీకరణ నిరంతరం జరుగు ప్రక్రియన్నారు.  యాంత్రీకరణ సాగుతో పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతుందని వివరించారు. చీడ పీడల సమస్యలు తలెత్తకుండా ఉంటాయని చెప్పారు. నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని వివరించారు. అనకాపల్లి పరిశోధన సంస్థ ఎడి భరత లక్ష్మి మాట్లాడారు.

          వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్ యాంత్రీకరణ పద్దతుల పై మాట్లాడారు. రైతు వరహ నర్సింహం మాట్లాడుతూ ఎన్.ఆర్.జి.యస్. కూలీ పనులకు వెళ్లడం వలన కూలీలు దొరకడం లేదని, ఈ సమయంలో యాంత్రీకరణలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. యాంత్రీకరణ తో ఒక రోజు కు 5 ఎకరాల భూమిని వరినాట్లు వేయవచ్చని, దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు.  రైతు సింహాచలం మాట్లాడుతూ లేజర్ గైడెడ్ లెవలర్స్ జిల్లాకు తీసుకురావాలని చెప్పారు. యాంత్రీకరణ తో దిగుబడి పెరుగుతుందన్నారు. రైతు మధుసూదనరావు, పంచిరెడ్డి సింహాచలం చెరకు సాగు పద్ధతులు పై వివరించారు.  అంతకు ముందు అక్కడే ఏర్పాటు చేసిన యాత్రీకరణ లు చెరకు నరకు యంత్రం, 5 రెక్కలు నాగళ్ళు, రోటా వేటర్, కలుపు తీత యంత్రం, ధాన్యం మిల్లర్లు, తుంపర్ల సేధ్యం, వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన వరి దిగుబడి, విత్తనాలు వేయు పద్దతి, ఎరువులు స్టాల్స్ ప్రదర్శనలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కలుపు, ఎరువులు వాడకంపై బ్రోచర్లను ఆవిష్కరించారు.  భారత వాతావరణ పరిశోధనా సంస్థ ఏర్పాటు చేసిన డాము యాప్  డౌన్‌లోడ్ చేసుకుంటే ముందుగా పిడుగులు పడే సమాచారం బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఉత్తర ఆంధ్ర అగ్రి మిషన్ సభ్యులు జి. రఘురామ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు సభ్యులు డాక్టర్ ఎస్. నేతాజి, సర్పంచ్ పి. దానమ్మ, ఆత్మ పిడి కె. కృష్ణారావు, ఎపిఎంఐపి పిడి జమదగ్ని, రాగోలు పరిశోధన సంస్థ డా. సత్యనారాయణ, చిన్నంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు