విద్యార్థులు ఉన్నత చదవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. గురువారం విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెండవ విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల 97 వేల మంది విద్యార్థులకు 694 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. నేరుగా విద్యార్థులు తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివితేనే తలరాతలు మారుతాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఇతరులకు శత శాతం ఫీజు రీ ఎంబార్స్ మెంట్ ఉంటుందని చెప్పారు. చదువులకు పిల్లలు తల్లిదండ్రులు అప్పులు అవ్వకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకాలతో పిల్లలు భవిష్యత్తు మార్చడానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రతీ త్రైమాసికానికి నేరుగా విద్యార్థులు తల్లులు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రెండవ విడత జగనన్న వసతి దీవెన డిశంబరులో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, పాతపట్నం, రాజాం శాసన సభ్యులు రెడ్డి శాంతి, కంబాల జోగులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ. రత్నం, గిరిజన సంక్షేమ శాఖ డిడి కమల, బిసి సంక్షేమ శాఖ డిడి కృతిక, రిటైర్డ్ సెట్ శ్రీ సిఇఓ సూరంగి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం 32,81,08,342 రూపాయల చెక్కును విద్యార్థులకు అందజేశారు.