విజయనగరం జిల్లా కలెక్టర్ గా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు, అనధికారులు, ఇతరులు ఇకపై తనకు పూల దండలు, పుష్ప గుచ్ఛాలు తేవద్దని సూచిస్తున్నారు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న ఏ. సూర్యకుమారి. దానికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగ పడేలా నోటు పుస్తకాలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. పుష్ప గుచ్చాల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని విద్యార్థులకు ఉపయోగ పడే పనికి వినియోగించడం వల్ల ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసినట్లవుతుందని అందరూ ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ గా ఈ నెల 30న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. దీనితో నూతన కలెక్టర్ ప్రతిపాదనను అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతిస్తున్నారు.