సింహాద్రి అప్పన్నకు కలెక్టరమ్మ పూజలు..


Ens Balu
2
Simhachalam
2021-07-29 14:01:12

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి దంపతులు గురువారం సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ  వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారికి పూజలు చేశారు.  ఇటీవలే విజయనగరం కలెక్టర్ గా నియమితులైన ఆమె స్వామివారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులకు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ, ఏఈఓ రాఘవ కుమార్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కలెక్టర్ స్వామివారికి పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా, దేవస్థానం అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కాగా ఆమె శుక్రవారం విజయనగం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.