ఆర్బన్ పీహెచ్సీకి మేయర్ శంకుస్థాపన..
Ens Balu
4
విశాఖ సిటీ
2021-07-29 15:10:29
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గురువారం 5వ జోన్ 41వ వార్డు లోని సుబ్బలక్ష్మి నగర్ లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంతనింగ్ మరియు జాతీయ ఆరోగ్య పథకం నిధుల నుండి 80 లక్షల అంచనా వ్యయంతో నేడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, పనులు వెంటనే ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రతి వార్డులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, పేద ప్రజల కొరకు నవరత్నాలులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, అయిదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజనీర్ పి. శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.