గరుడవారధి రూ.25 కోట్లు కేటాయింపు..


Ens Balu
1
Tirumala
2021-07-29 16:19:32

గరుడవారధి పనుల ప్రగతిపై టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి గురువారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టిటిడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పనుల కోసం రెండో విడతగా రూ.25 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటివరకు టిటిడి రూ.50 కోట్లు విడుదల చేసినట్టయింది.  తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి నంది సర్కిల్ వరకు వారధి పనులు  పూర్తి కావచ్చాయని, ఆగస్టు నెలాఖరుకు యాత్రికులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈఓకు వివరించారు. ఈ సమీక్షలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గిరీష, స్మార్ట్ సిటి జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్  మోహన్, టిటిడి ఎఫ్ఏ అండ్ సిఏవో  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.

సిఫార్సు