అధికారులకు స్థానిక నివాసం తప్పనిసరి..


Ens Balu
2
Guntur
2021-07-29 16:31:32

గుంటూరు జిల్లాలోని అన్నిశాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు వారు విధులు నిర్వహిస్తున్న ప్రదేశాలలోనే ఖచ్చితంగా నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ నేడోక ప్రకటనలో ఆదేశించారు. ఆ విధంగా వారి కార్యస్థానంలో నివాసం ఉండని అధికారులపై శాఖాపరమైన  క్రమశిక్షాణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారుల పనితీరుపై అసనం వ్యక్తం చేసిన తరుణంలో జిల్లా కలెక్టర్ స్థానిక నివాసం ఆదేశ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.