సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) సీఎండీ , డైరెక్టర్ల కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎండీ ఆర్ మాధవన్ కుటుంబ సభ్యులు, సీఈఓ మైథీ , డైరెక్టర్లు అనంతకృష్ణన్, ఎంఎస్ వెలపరి, అలోక్ వర్మ, అరూప్ చటర్జీ కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. వారందరికీ వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. అంతముందు వీరంతా స్వామివారి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ విశేషాలను దేవస్థాన సిబ్బంది హాల్ డైరెక్టర్ల బ్రుందానికి తెలియజేశారు. కార్యక్రమంలో దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.