సింహాద్రి అప్పన్నకు రూ.1,00,116 విరాళం..


Ens Balu
1
Simhachalam
2021-07-29 16:40:18

విశాఖ  బాపూజీనగర్ కు చెందిన దాసరి పృధ్వీ రెడ్డి సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(అప్పన్న)స్వామి నిత్య అన్నదాన పథకానికి   లక్షా నూట పదహారు రూపాయలు (1,00,116)  విరాళమిచ్చారు. ఆ మొత్తాన్నిచెక్కు రూపంలో గురువారం పీఆర్వో కార్యాలయంలో  అందించారు . తన జన్మదినోత్సవమైన మే 20న స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని దాతలు కోరారు. దాతలకు  టెంపుల్ ప్రొటోకాల్ ప్రకారం స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు అధికారులు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టి, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం కల్పించారు.  టెంపుల్ ఏఈఓ ప్రసాదాన్ని అందించారు.