వికలాంకులకు ప్రత్యేక సదుపాయాలు..


Ens Balu
2
Simhachalam
2021-07-29 16:53:01

సింహాచలం దేవస్థానంలో వికలాంగులకు ఉచితంగానే వీల్ ఛైర్, లిఫ్ట్ అన్ని సమకూర్చి దేవదేవుని దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. ఈ మేరకు ఈఓ సూర్యకళ ఆదేశాలతో ఈ సేవ అమల్లోకి వచ్చింది. గురువారం బరంపురం నుంచి వచ్చిన ఒక వికలాంగురాలు సాయంత్రం వచ్చిన ఈ జంటకు వీల్ ఛైర్ ఇచ్చి, లిఫ్టులో పైకి తీసుకెళ్లి దర్శనం చేయించారు సిబ్బంది.  తన భార్యకు కాలి సమస్య ఉందని.. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించి ఆపరేషన్ చేయించి స్వామివారి చెంతకు తీసుకొచ్చానని చెప్పారు బరంపురంవాసులు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, వికలాంగులు, నడవలేని వయస్సు మళ్లిన వారు దర్శనానికొస్తే సెక్యూరిటీ సహా సిబ్బంది సహకరించి సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సూచించారు.  వీల్ ఛైర్ లు పీఆర్వో ఆఫీసులో ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు..