సంక్షేమ పథకాలపై అవగాహనుండాలి..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-07-29 16:59:12

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పై సచివాలయ ఉద్యోగులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్  డా.ఏ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు.  గురువారం ఆయన స్వర్ణభారతి స్టేడియం వద్దగల పాత రేసపువానిపాలెం 24వ వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని, వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను  ప్రదర్శించే బోర్డులను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల తో మాట్లాడుతూ వారి పని వివరాలు, ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు విషయమై అడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానం రానందున సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నింటిపైనా పునశ్చరణ శిక్షణ ఏర్పాటు చేయాలని యు.సి.డి. పథక సంచాలకులు శ్రీనివాస్ ను ఆదేశించారు. లబ్ధిదారులకు ఉండవలసిన అర్హతల గురించి క్షుణ్ణంగా   తెలుసుకోవాలన్నారు.  విధి నిర్వహణలో మంచి ప్రావీణ్యం సంపాదించాలని చెబుతూ వారికి సలహాలు సూచనలు ఇచ్చారు.  అనంతరం కలెక్టర్ అర్బన్ హెల్త్ క్లినిక్ ను తనిఖీ చేశారు.