కలెక్టర్ ను కలసిన ఇన్ చార్జ్ డిఎఫ్ఓ..
Ens Balu
2
Srikakulam
2021-07-31 15:17:27
విశాఖపట్నం సోషల్ ఫారెస్ట్ డి.ఎఫ్.ఓ., శ్రీకాకుళం ఇన్ చార్జ్ డి.ఎఫ్.ఓ. డి. లక్ష్మణ్ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. వచ్చే నెల 5వ తేదీన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి 72వ వన మహోత్సవ కార్యక్రమం మంగళగిరిలోని ఎయిమ్స్ కళాశాలలో ప్రారంభిస్తున్నారని, అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. జిల్లాలో 72వ వన మహోత్సవ కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నికల్ (బాయ్స్)లో ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కు చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసన సభాపతి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు, శాసన సభ్యులు, అధికారులు పాల్గొంటారని ఆయన కలెక్టర్ కు వివరించారు.