భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలి..
Ens Balu
2
Tirumala
2021-07-31 15:26:36
కరోనా మూడో దశ(థర్డ్ వేవ్)కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని , తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. కొంతమంది యాత్రికులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా సంచరిస్తుండడం సమంజసం కాదు. ఈ కారణంగా తోటి యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులు విధిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని కోరుతోంది. తిరుమలలో యాత్రికుల రద్దీ ప్రాంతాలు, టిటిడి స్థానికాలయాలు, తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం తదితర ప్రాంతాల్లో విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.