ఈవీఎంలకు పటిష్ట భద్రత..


Ens Balu
3
Guntur
2021-07-31 15:29:23

రాష్ట్ర ముఖ్య  ఎన్నికల  అధికారి  ఆదేశాల  మేరకు మాసాంత తనిఖీలలో భాగంగా గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను,   ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం వ్యవసాయ మార్కెట్  యార్డు లో వీవీపాట్స్ ను భద్రపరచిన  గోడౌన్ ను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్ శనివారం తనిఖీ చేసారు. రాజకీయపార్టీల ప్రతినిధులతో కలసి గోడౌన్ల తాళాలకు వేసిన  సీళ్ళును పరిశీలించారు. ఇవియం, వీవీపాట్స్ ల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అమరావతి– అనంతపురం ఎక్స్ప్రెస్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్లు నోడల్ ఆఫీసర్ వి.శైలజ, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య,  గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు పశ్చిమ మండల తహశీల్దారు మోహనరావు, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్, బహుజన సమాజ్ పార్టీ సిటి ప్రెసిడెంట్ చిరతనగండ్ల వాసు, సీపీఐ పార్టీ తరుపున కె.ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ తరుపున అడవి ఆంజనేయులు,   రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

సిఫార్సు