ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు..
Ens Balu
3
Srikakulam
2021-07-31 15:48:25
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా నేటి నుండి తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీచేసారు. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆగష్ట్ 1 నుండి 7వ తేది వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తల్లి పాలు ఇవ్వటాన్ని ప్రోత్సహించండి – ఇది మనందరి బాధ్యత అనే నినాదంతో ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. సాదారణ మరియు సి –సెక్షన్ డెలివరీ రెండింటిలోనూ డెలివరీ అయిన ఒక గంటలోపు తల్లి తమ బిడ్డకు తప్పకుండా పాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది తల్లికి మరియు బిడ్డకు ఆరోగ్యకరమని ఆయన చెప్పారు. తల్లి పాల వారోత్సవాలలో ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.