దిశ యాప్ ప్రతీమహిళా డౌన్లోడ్ చేయాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-07-31 15:54:33

“దిశ” యాప్ ను ప్రతి ఒక్క మహిళ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని జవిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. శనివారం విశాఖ బీచ్ రోడ్లో పోలీస్ శాఖ వారు ఏర్పాటుచేసిన “దిశ” యాప్ కోసం మహిళలకు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలపై ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, దానిని అరికట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి “దిశ” చట్టాన్ని తీసుకొచ్చారని, మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అన్నగా నిలబడ్డారని మేయర్ తెలిపారు. ఈ “దిశ” యాప్ గురించి పూర్తి వివరాలు ప్రతి సచివాలయంలోని మహిళా పోలీసుల వద్ద ఉన్నాయని కావున, ప్రతి ఒక్క మహిళ, కాలేజీ విద్యార్థులు మొదలైనవారు ఈ “దిశ” యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ తరుపున డిసిపి శాలి గౌతమ్, ఎసిపి(దిశ) డా. ప్రేమ్ కుమార్, టౌన్  సిఐ ఈశ్వర రావు “దిశ” చట్టం ఉపయోగం గురుంచి మహిళలకు అవగాహన కల్పించారు.