విశాపట్నం జిల్లావ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పతివాడ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆగష్ట్ 1 నుండి 7వ తేది వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తల్లి పాలు ఇవ్వటాన్ని ప్రోత్సహించండి – ఇది మనందరి బాధ్యత అనే నినాదంతో ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. సాదారణ , సి –సెక్షన్ డెలివరీ రెండింటిలోనూ డెలివరీ అయిన ఒక గంటలోపు తల్లి తమ బిడ్డకు తప్పకుండా పాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది తల్లికి బిడ్డకు ఆరోగ్యకరమని ఆయన చెప్పారు. తల్లి పాల వారోత్సవాలలో ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన వివరించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరింత అవగాహన కల్పించనున్నట్టు డిఎంహెచ్ఓ వివరించారు.