ఆర్డీగా డా.పతివాడ సూర్యానారాయణ..


Ens Balu
4
Visakhapatnam
2021-07-31 16:47:20

విశాఖజిల్లా ప్రాంతీయ ఆరోగ్య సంచాలకులుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సూర్యనారాయణను ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆర్డీగా వున్న డా.జి.సావిత్రి ఉద్యోగవిరణ చేయడంతో ఆ బాధ్యతలను ప్రభుత్వం డిఎంహెచ్ఓ కి అప్పగించింది. ఈమేరకు శనివారం సాయంత్రం ఆయన ఆర్డీగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా విధినిర్వహణ చేపడతానని చెప్పారు. ఆర్డీ పరిధిలోని అధికారులు, సిబ్బందితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి దిశ నిర్దేశం చేస్తామన్నారు.


సిఫార్సు