అప్పన్నకు రూ. 50వేలు విరాళం..


Ens Balu
2
Simhachalam
2021-07-31 17:22:36

విశాఖఓల్డ్ డైరీ ఫారం (వెట్నరీ కాలనీ)కి చెందిన దుప్పల రామన్న సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(అప్పన్న) స్వామివారికి  50,000 (యాభై వేల రూపాయల) విరాళం అందించారు. తన పుట్టినరోజైన డిసెంబర్ 12వ తేదీన స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని కోరారు.   ఈ మేరకు ఇరువురూ పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్లో చెక్ లు అందించారు. ఈ సందర్భంగా స్వామికి పూజలు చేసిన దాతలు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దేవస్థాన సిబ్బంది ప్రసాదాలు అందజేయగా, అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 


సిఫార్సు