తెలుగు అకాడమిని త్వరలోనే ఉద్ధరింస్తాం..


Ens Balu
3
Srikakulam
2021-08-01 12:33:34

రాష్ట్ర తెలుగు అకాడమిని ఉద్దరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షులు డా. నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలుగు అకాడమీ అధ్యక్షులు గురుగుబెల్లి లోకనాథం రచించిన గులోనా గుళికలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. తెలుగును బ్రతికించుటకు సంస్కృతాన్ని అకాడమీలో చేర్చారని చెప్పారు. తెలుగు ప్రాకృతంలో పుట్టిందని, పాళీ భాషలో అమరిందని అనేక భాషలను తనలో చేర్చుకుంటూ భాషలలో ప్రత్యేక భాషగా ఉద్భవించిందని ఆమె వివరించారు. ఉపనిషత్తుల ద్వారా సంస్కృతం దేవ భాషగా మారిందని, తెలుగు భాష సంస్కృతాన్ని ఇమిడించుకుందనీ ఆయన చెప్పారు. రెండు భాషలు లీనమైపోయాయని ఆమె తెలిపారు. భాష నిరంతర ప్రవాహం అన్నారు.సంస్కృతులు, సంప్రదాయాలు కలుపుకొని సాగే గుణం తెలుగు భాషకు ఉందనీ చెప్పారు. విశాలతత్వం తెలుగు భాషకు ఉందనీ ఆమె తెలిపారు. రాష్ట్రంలో పేదల కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని అయితే తెలుగు విధిగా నేర్చుకోవాలని ఆమె పేర్కొన్నారు.నాసా సంస్కృతానికి పెద్ద పీట వేసిందని అన్నారు. గులోనా గుళికలు వ్యాస సంపుటి ఎంతో చక్కని, సమాజానికి  ఉపయోగడే అంశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్య అతిథి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రచనలు తరతరాలకు సూచికగా నిలుస్తాయన్నారు. సమాజాన్నిరచయితలు సంస్కరించాలని పిలుపునిచ్చారు. రచయితలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రచనల ముద్రణకు తెలుగు అకాడమి ప్రయత్నించాలని సూచించారు. రచయితలకు మంచి స్థానం కల్పించాలని పేర్కొంటూ గులోన మరిన్ని రచనలు చేయాలని ఆకాక్షించారు. 

గులోనా గుళికలు రచయిత గురుగుబెల్లి లోకనాథం మాట్లాడుతూ సమాజంలో జరుగతున్న సంఘటనల సంపుటి ఈ రచన అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ హెచ్. లజపతిరాయ్, పాత్రికేయులు నల్లి ధర్మారావు, రచయిత అట్టాడ అప్పలనాయుడు, వైద్యులు దానేటి శ్రీధర్,  తదితరులు పాల్గొన్నారు.