స్పందన ను సద్వినియోగం చేసుకోవాలి..
Ens Balu
2
Kakinada
2021-08-01 13:49:27
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 2వ తేదీన సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్, జిల్లాస్థాయి ఉన్నతాధికారులు నేరుగా స్వీకరిస్తారని, సదరు అర్జీల సత్వర పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.