మాస్కు ధరించి కరోనాను జయిద్దామని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. కోవిడ్ మూడోదశను ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ పై విస్తృత అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద ప్రచార రథాలను కలెక్టర్ సూర్యకుమారి, స్థానిక ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు.అంతకుముందు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కోవిడ్ అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, ప్రతీఒక్కరూ వేక్సిన్ వేయించుకోవాలని నినాదాలు చేశారు. కోవిడ్ జాగ్రత్తలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రత్యేకంగా నో మాస్క్-నో ఎంట్రీ, నో మాస్క్-నో రైడ్, నో మాస్క్-నో సేల్ అంటూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ విక్రమాధిత్య, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ నాగభూషణరావు, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, సెట్విజ్ సిఇఓ విజయకుమార్, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, మెప్మా పిడి కె.సుగుణాకరరావు, డిపిఆర్ఓ డి.రమేష్, డిప్యుటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఫోరమ్ ఫర్ బెటర్ విజయనగరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నీడ్, నేచర్, స్వీట్, జిఓ ఎన్‌జిఓ(కోవిడ్ ఫోరమ్), స్వార్డ్, ఉజ్వల, చేయూత తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.